Saturday, 24 September 2011

జ్యోతిష్యశాస్త్ర పరిచయము

గణిత శాస్త్రములో “సమితులు – సంయోగములు” తెలిసిన వారికి జ్యోతిష్య శాస్త్రమును అభ్యసించడము చాలా తేలిక. వీరికి మనస్తత్వ విశ్లేషణపై అవగాహన ఉంటే మరింత తేలికగా నేర్చుకోవచ్చు. “సమితులు- సంయోగములు” తెలిసిన వారికి వృత్తము, చాపము, కోణమును లెక్క కట్టడము తప్పక తెలిసి ఉంటుంది. వీటి ద్వారా జ్యోతిష్య చక్రములోని అనేక సూక్ష్మ విభాగాలు వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. జ్యోతిష్య చక్రములోని 12 సంజ్ఞలు 12 సమితులను సూచిస్తుంది. అలాగే 9 గ్రహాలు 9 సమితులను సూచిస్తుంది. ఇవికాక 12 భావాలు 12 సమితులను సూచిస్తుంది. ఈ సమితుల సంగ్రహణలో మనస్తత్వశాస్త్రము యొక్క భాగములు కూడా ఉంటాయి. అలాగే మన దిన చర్యలో భాగము పంచుకొనే భావాలు కూడా అనేకo ఉంటాయి. ఇవే కాక మన సోదర, బంధు, స్నేహిత వర్గము కూడా ఇందులో చేరి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే “పరాశర మహర్షి” ఇచ్చిన సూచనల ప్రకారము ప్రతి జీవి చేసే అనేక రకములైన పనులను, ఆలోచనలను ఒక్కొక్క సమితులలో భాగము పంచుకొన్నాయి. వీటి యొక్క విశ్లేషణ “జ్యోతిష్య శాస్త్రము”.

ఒక జాతక చక్రము జాతకుడిని అంటే ఉదయించే క్షేత్రజ్ఞుడిని, అలాగే అతనిని అస్తమింపచేసే శత్రువుని (Descendant) సూచిస్తుంది. ఆంతే కాక జాతకుని తండ్రిని 9 వ స్థానము ద్వారా, తల్లిని 4 వ స్థానము ద్వారా, అలాగే 5 వ స్థానము తాతను, పుత్ర స్థానమును, జాతకుని మూడో సోదర/రి లను సూచిస్తుంది. జాతకుని జన్మ సమయమును బట్టి, ఆంటే పగలు ఐతే సూర్యుడు తండ్రిగాను, రాత్రి ఐతే శని తండ్రి గాను ఉదహరిస్తారు. చుక్కపొడుపుగా వ్యవహరించే శుక్రుడు పగలు తల్లిగా, చంద్రుడు రాత్రి తల్లిగా పేర్కొంటారు. కర్కాటక, వృశ్చిక, మీన లజ్ఞాలకు మాత్రము చంద్రుడు తండ్రిగా ఒక్కోసారి వ్యవహరిస్తాడు. ఇందుకు కారణము “తారాశశాంఖము” అను పురాణకధలో కనిపిస్తుంది. అందుకనే ఈ లగ్నములలో 6 నవాంశలు శాపగ్రస్త జీవులకు జన్మనిస్తుంది. ప్రతి రాశిలో ఆంటే 30* ఒక సంజ్ఞలో 15* సూర్యుడు, 15* చంద్రుడు దత్తత తీసుకోవడము వల్ల దీనిని హోరా అనే పేరుతో పిలుస్తూ వ్యవహరిస్తుంటారు. ప్రతి జీవి ఇందువలన కలిగిన సౌకర్యము మేరకు సూర్యుడు హోరాగా ఐతే ఆత్మబలమును, చంద్రుడి హోరా ఐతే బుద్ది బలమును పొందుతారు. ఆత్మబలమును కలిగిన వారు అనేకమైన విద్యలు(ఎక్కువగా బుద్దిని ఉపయోగించని) ప్రదర్శిస్తుంటారు. వీటిలో ముఖ్యమైనవి గారడీ, ఆటలు, శరీర పాటవము ప్రదర్శించే అనేక అంశాలు, నాడీ జ్యోతిష్యము లాంటివి ఉంటాయి. అదే బుద్ది బలమును పొందిన వారు చేసిన పనికి వివరణ ఇవ్వగల శక్తి కలిగిఉంటారు. అంటే శాస్త్రవేత్తలు, ఉపధ్యాయవృత్తివారు, మంత్రాoగము చేయువారు, అర్ధశాస్త్ర నిపుణులు, జ్యోతిష్యశాస్త్ర పండితులు మొదలైనవారు. ప్రతి సoయోగములోనూ ఈ ‘హోర’ పని చేయుట వలన సూర్య, చంద్ర బలములు ముఖ్యకారణములైనవి.

కేవలం ఒకరి జాతక చక్రము నుండి పూర్తి విషయములు తెలుసుకొనుట అసాధ్యము. ఎందుకంటే ఒకరి జాతకము అతని కుటుంబ సభ్యుల జాతక చక్రములో కూడా కనిపిస్తుంది. అలా ఒక్కరి జాతకము అన్నీ మార్గాల ద్వారా అంచనా వేసిన తరువాత కానీ ఒక అంచనాకు రాలేము. ఉదా.: చంద్రుడు తల్లి గాను, పెద్ద భార్యగాను లెక్క కట్టుదురు. ఒకరి జాతకములో జాతకుని తల్లి ఐతే ఆ కుటుంభ సభ్యులలో ఒకరి ఆత్మకు పెద్ద భార్య అవవచ్చు. అంటే ఆ ఇంటి పూర్వీకులలో ఒకరికి ఇద్దరు భార్యలు ఉండవచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకుని సహాయము చాలా అవసరము. లేదా ఆ కుటుంబమునకు తరతరాలుగా జ్యోతిష్యశాస్త్ర పండితులు ఉంటే వారి అంచనాలు అవసరము. ఇవన్నీ కానపుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరికి వారి జాతక బలమును బట్టి “INTUITION” ద్వారా కానీ, లేదా ఆత్మసాక్షాత్కారము కానీ జరిగి విషయము పూర్తిగా అవగాహనకు వస్తుంది. జరగబోయే అనేక కష్టానష్టములు వారి ద్వారా బహిర్గతమవుతాయి. ఇందుకు “పరాశర మహాముని” కొన్ని మార్గములు ఉపదేశించారు. దీని ప్రకారము జాతకుడి చక్రములోని మూడు దశలలో ఒక దశలో విభాగాల ద్వారా గురువు, శుక్రుడు ఒకరికి ఎదురు ఒకరు వస్తే ఆ జాతకుని జీవితము మలుపు తిరిగి కర్మ స్థానాధిపతి ద్వారా తన జీవితములో జ్యోతిష్యశాస్త్ర అభ్యాసానికి అవకాశము అందివస్తుంది. ఇంకొక అంశము లేదా నిబందన లగ్నము నుండి 5వ రాశిలో రాహువు ఉన్నట్లైతే అటువంటి జాతకులకు “కలల” ద్వారా జరుగబోయే విషయాలు ముందస్తుగా తెలుస్తుంది. దానికి కారణము రాహువు పుత్రస్థానములో ఉంటే వారికి పిల్లలు పుట్టి మరణించడము లేదా పిల్లలు పుట్టక పోవడము లేదా వారి కారణముగా పుత్ర రుణబంధము లేకపోవడము జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయా జాతకుల సహకారము లేదా జ్యోతిష్కుడితో counseling చాలా అవసరము. అలా కానిచో ప్రతి ఒక్కరూ జ్యోతిష్య శాస్త్రమును నేర్చుకొని తమ తమ కర్మను అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కానీ ఏ ఒక్క జ్యోతిష్కుడు(పండితుడే కావచ్చు) వలన ఈ కలియుగములో అంటే అధర్మము మూడు కాళ్లతో నడిచే ఈ కాలములో ఒకరి(కుటుంబ) కర్మ గురించి ఇంకొకరి ద్వారా తెలుసుకోవడము నూటికి నూరుపాళ్లు అసాధ్యము. కావున తస్మాత్ జాగ్రత్త వహించవలసినదిగా కోరుచున్నాను.

Wednesday, 27 April 2011


జ్యోతిష్య చంద్రుడు 

జ్యోతిష్య శాస్త్రం ఆధారముగా చంద్రుడు తల్లి గాను, సూర్యుడు తండ్రి గాను ఉదహరిస్తారు. కాని కొద్దిగా లోతు కెలితే పగలు జన్మించినవారికి శుక్రుడు తల్లి గాను, సూర్యుడు తండ్రి గాను మరియు రాత్రి జన్మించినవారికి శని భగవానుడు తండ్రి గాను, చంద్రుడు తల్లి గాను  వ్యవహరిస్తారు. దీనికి ఆధారముగా వరాహ మిహురుడు లేదా పరాశర మహర్షి వ్రాసిన గ్రంధాలు పేర్కొనవచ్చు. శాస్త్రం బాగా వచ్చిన వారు మాత్రమే ఈ తేడాను గమనించగలరు. ఎలా చూచిన ఒకే భావము వచ్చులాగా కొందరి జాతకాలు ఉంటాయి. కొద్ది తేడాతో ఇంకొందరి జాతకాలు ఉంటాయి. అందువల్ల వీటి లోని తేడాలను "మనుస్మృతి" శాస్త్రం ఆధారముగా గుర్తించవచ్చు. ఇందువల్ల జన్మ నక్షత్రము లోని వ్యత్యాసమును గమనించవచ్చు. సహజముగా ఒక రాశికి 9 పరిమితులలో తేడాలు  ఉంటాయి. అటువంటప్పుడు ఒకే రాశి వారందరూ ఒకేలా ఉంటారనుకోవడం చాల తప్పు. ఈ విరుద్ద భావాలను కనిపెట్టడములో గల ఆవశ్యకతను గుర్తించడంలో "మనుస్మృతి" చాల ఉపయోగపడుతుంది. చంద్రుడు నీచములో నున్న యడల అందులోని భావములో చాల తేడాలు గమనించవచ్చు. జాతకుని తల్లి బిడ్డ జన్మించుటకు పూర్వమే కామపరమైన సంబంధము కలిగి ఉన్నదని వెంటనే వచ్చు సూచిక. ఐతే అది ఆ జాతకుని తండ్రితో(వివాహమునకు పూర్వమే)నా లేకా ఇతరులలో ఎవరితోనైనా అన్నది కనిపెట్టడం కొద్దిగా ఉహాజనీతమే. అందుకు కారణము జాతకుని కుటుంబము గూర్చి  పూర్తీగా తెలిసి ఉండకపోవడమే. అందుకని ఇటువంటి సందర్భములో వారికే సుత్రాప్రయాముగా తెలియచేసి విషయమును ముగించవలెను. ప్రస్తుత కాలములో వైద్య పరముగా అనేక పరీక్షలను చేసి స్త్రీల యొక్క శీలాన్ని నిర్దారించేవాళ్ళు. కాని ప్రాచీన కలాములో ఉన్న ఒకే ఒక ఆధారము పుట్టిన మొదటి బిడ్డ జన్మ నక్షత్రమే. అది నీచస్తానమైతే ఆ కాలములో భార్యను వదలి వేయడము జరుగుతున్నది.  ఇందుకు సంబంధించి పురాణములో గల "తారా శశాన్కము" ను ఉదహరించవచ్చు. ఈ కథలో బృహస్పతి బార్యను చంద్రుడు పట్టుకెళ్ళగా దక్షుడు కలుగ చేసికొని చంద్రుడిని శపించి తార ను తిరిగి బృహస్పతికి అప్పగించడం మీ కందరకు తెలుసు. తదుపరి తార  బిడ్డను కనడం పుట్టిన బిడ్డ జాతకములో తల్లి స్థానం నీచములో ఉండుట వల్ల బృహస్పతి  తారను అడిగి వివరములు తెలిసికొని తన బిడ్డగా తిరస్కరించడము జరిగినది.  అలా పుట్టిన బిడ్డడే  'బుధుడు'. అందుకే జేష్ఠ నక్షత్రము నీచ స్తానమైనది. ఈ విషయము తెలిసి దక్షుడు తిరిగి ప్రాధేయపడి తారను ఎలుకొమ్మని బ్రతిమాలుట జరిగినది విదితమే. విషయము తెలిసికొన్న బుధుడు అప్పటినుండి చంద్రుడికి పరమ శత్రువు కావడం జరిగినది. అందువలననే కన్య, మిథున రాశిలో వారికి కృష్ణపక్ష చంద్రుడు ఉండుట వలన మంచి జరుగదు. కేవలం శుక్లపక్ష చంద్రుడు ఉంటె చాల మంచిది. చంద్రుడితో పాటు బుధుడు కూడా ఉంటె మరింత శుభం. 

ఈ కథలోని నీచత్వపు భాగాన్ని మాత్రమే తీసుకొంటే ప్రస్తుత కాల పరిస్తితులలో పార్కుల వెంట జరుగుతున్నా అనేక కామ రామాయణములకు నేటి యువతి యువకులు భవిష్యత్తులో ఎన్ని కష్టనష్టములకు అనుభవిన్తురోనని భావించి ఈ పూర్తీ గాధను అందించవలసి వచ్చింది. అందుకని ఇది ఎవరిని కించపరచే ఉద్దేశ్యముతో వ్రాయలేదని గమనించ వలసినది. నేటి యువతి యువకుల పోకడ "Break the Rules " అంటూ చేసే పోకడ యుగంతామునకు దగ్గరి దారి. అది ఎలా కారణము అవుతుందో చదవండి. ఇక్కడ విధిగా "మనుస్మృతి" యొక్క కొన్ని ముఖ్య నిబంధనలను image రూపములో ఉంచడం జరిగినది. ఈ మనుస్మృతి పుస్తకము యొక్క పేరు, ప్రచారకుడి పేరు యొక్క వివరముల కోసము పుస్తకం యొక్క మొదటి పేజీని 'click'  చేసి తిలకించగలరు.

సృష్టి, స్థితి, లయ కారణి ఒక్క స్త్రీ మూర్తి మాత్రమే. "భగవంతుడు" స్త్రీని సృష్టిస్తూ ప్రతి సృష్టి చేసే అవకాశాన్ని మరియు సృష్టించిన జీవులు మనుధర్మాన్ని ఆచరించనపుడు విధ్వంసకారిణిగా అవతారమెత్తి తన సృష్టినే సర్వ నాశనము చేయగల శక్తిని ప్రసాదించాడు. అందుకనే జ్యోతిష్య శాస్త్రములో కేంద్ర స్థానమునకు గల ప్రత్యేకత అటువంటిది. మనువు అంటే 'బ్రహ్మ' ధర్మానికి కాలనిబంధన పెట్టి అంటే కృత యుగములో నాలుగు కాళ్ళతోనూ,  త్రేతాయుగములో మూడు కాళ్ళతోనూ, ద్వాపర యుగములో రెండు కాళ్ళతోనూ చివరి దైన కలి యుగములో ఒంటి కాలితో నడిచేటట్లు విశ్వాజనావళికి సృష్టికి అనుజ్ఞ ఇవ్వటము జరిగినది. ఇవన్నియును మీకు తెలిసినవే ఐన మరొక్కమారు గుర్తుకు తెస్తున్నాను. ఇప్పుడు మనుస్మృతి లోకి వెళదాం. మొదట చెప్పినట్లు మనుస్మ్రుతిలోని స్త్రీ యొక్క స్వతంత్రతను చూద్దాం.  

   
పై రూల్స్ "Duty of Woman " అనే చాప్టర్ లో కలవు. వీటితో పాటు అనేక నియమాలు స్త్రీ ని ఉద్దేశించి వ్రాసారు. అలాగే "Eternal Laws to Woman " లో కూడా కొన్ని నియమాలను నిర్దేశించారు. అవి 

      
ఇలా ఎనిమిది వందల పుటల పుస్తకంలో సుమారు ముప్పది పుటల వరకు స్త్రీని ఉద్ద్దేశించి వ్రాయబడ్డది. ఇవన్ని చూసాక వర్తమాన కాలములో స్త్రీ తన గోతిని తనే తవ్వుకొంటు విశ్వనాశనము ఎలా చేయగలదో ఉహించవచ్చు. అందుకే జ్యోతిష్య శాస్త్రములో శుక్రాచార్యుడు కేవలము కళత్ర స్థానానికి అధిపతిగా తన పనిని నిర్విగ్నముగా నిర్వహిస్తూ స్త్రీ ని ఉత్తేజిత శక్తిగా మారుస్తున్నాడు. ఇందుకు ఉదాహరణ ఎ స్త్రీ కైతే శుక్ర దోషము ఉంటుందో ఆ స్త్రీ కి పెళ్ళైన వెంటనే అంటే ఒక సంవత్సరపు లోపు భర్తకు ఉద్యోగమూ ఊడి తన యొక్క ప్రతిభతో ఉద్యోగమూ తెచ్చుకొని ఇంటిలో చలామణి అవుతుంది. ప్రస్తుతం స్త్రీకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావటానికి ఇది ఒక కారణము. ఇలా జరుగుతూ పొతే విశ్వనాశనమునకు, యుగాంతమునకు మనము దగ్గర పడుతున్నట్లే. అవునంటారా! కదా! 

నేనేమి స్త్రీ వ్యతిరేకిని కాను. కాని ఉన్న విషయమును చెప్పవలేనన్న తపనతో కొద్దిగా ఎక్కువగా వ్రాసినచో క్షమించగలరు. కాని ప్రస్తుత కాలములో అనేక మంది స్త్రీలు కుజ దోషముతో పడరాని పట్లు పడుతూ కేతువు మహాత్యముతో దేవాలయముల చుట్టూ తిరుగుతుంటే ఈ విషయములను ఎందుకు మరుగున పడిపోతున్నదో నని ఇంత వివరణ ఇవ్వవలసి వచ్చినది. చాలామంది స్త్రీలకు కుజ దోషము అంటే ఏమిటో  తెలియక, తెలిసిన వారిని అడుగలేక నానా అవస్తలు పడుట చూస్తూ ముందస్తుగా ఈ వివిరణను ఇచ్చి "కుజ దోషము" అంటే ఏమిటో తెలియ చేయుటే నా ఉద్దేశ్యము.
మనిషిగా పుట్టాక సహజముగా శృంగారము పై మక్కువ అనేది వయసును బట్టి వస్తుంది. కానీ ఈ మక్కువ అనేది జాతకరీత్యా సూర్యుడు, కుజుడు అనే గ్రహ స్థాన స్థితిని బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇందులో సూర్యుడు సత్వగుణం కలిగి అగ్ని తత్వముతోనూ, కుజుడు తమోగుణం కలిగి అగ్ని, జల తత్వముతో ఉంటారు. తమో గుణం కలిగిన వారు వావి వరుస లేకుండా వారి కోర్కెలు తీర్చుకొంటారు. సత్వ గుణం కలిగిన వారు భార్య/భర్త ఒక్కరే కాకుండా ఇంకొకరి ద్వార కోర్కెలు తీర్చుకొంటారు. బృహస్పతి వీక్షణం బట్టి వీరిలో సత్ప్రవర్తన ఉంటుంది.
తమో గుణం కలిగిన వారు చేసే పైశాచిక కోర్కెల వలన "కుజ" దోషం ఏర్పడుతుంది. వీటినే ఆంగ్ల బాషలో "Incest" అంటారు. వీరి యొక్క లైంగిక ప్రయోజనము కొరకు రక్త సంబంధీకులు ఎక్కువగా ఉపయోగపడుతుంటారు. ఈ దోషము వలన ఆ కుటుంబంలో లైంగిక సత్ప్రవర్తన నశించి వారి అయుక్షీనత ఏర్పడుతుంది.